Home » Tag » Jawan
సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి
ప్రస్తుతం ఇండియాలో ప్రభాస్ ని మించిన స్టార్ లేడంటే అతిశయోక్తి కాదేమో. వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టీవీలోంచి వచ్చి షారుఖ్లానే బాలీవుడ్‌ని ఏలబోయాడు. కానీ, తను ఆత్మహత్య చేసుకోవడం అందర్ని షాక్‌కి గురిచేసింది. సరే ఇప్పుడున్న హీరోల్లో రణ్వీర్ సింగ్‌కి అంత సీన్ లేదనిపిస్తోంది.
సెలబ్రిటీలను వెంటపడి ఫోటోలు తీసే బ్యాచ్‌ని పపరాజీ అని కూడా పిలుస్తారు. అయితే నిజంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు అంత క్రేజ్ ఉందా.. జిమ్‌కి వెళ్లిన ప్రతీ సారీ అలా వెంటపడి ఫోటోలు తీసేంత ఖాళీగా మీడియా వాళ్లు ఉన్నారా.. తాజాగా దీనిపై సంచలన విషయాలు బయటపెట్టింది ప్రియమణి.
Sanya Malhotra: బాలీవుడ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. మరోవైపు గ్లామరస్ ఫొటో షూట్లతో రచ్చ చేస్తోంది. సాన్యా తాజా ఫొటోలివి.
షారుఖ్.. పఠాన్ లాగానే.. ఫైటర్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని.. హృతిక్ ఫస్ట్‌డే వంద కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు.
తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కథ కత్తిలా ఉంటే డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అనేది కూడా చూడరు తెలుగు ప్రేక్షకులు. అందుకే తమిళ్లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలకు కూడా తెలుగు మార్కెట్ కామధేనువుగా మారింది. టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ సొంతం చేసుకునేందుకు దేశాన్ని మన సినిమా చుట్టేస్తుంటే.. లోకల్ మార్కెట్‌ని తమిళ, కన్నడ, ఇంగ్లీష్ మూవీలు కబ్జా చేసేస్తున్నాయి. ఐదేళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ, ఇప్పుడిప్పుడే ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్లో సరుకులేని దర్శక రచయితల వల్ల అక్కడి ఆడియన్స్‌కి నచ్చే కంటెంట్ వాళ్లు ఇవ్వలేకపోయారు. అందుకే సౌత్ వైపు.. ముఖ్యంగా టాలీవుడ్ వైపు ఆతృతగా చూశారు. ఇప్పుడు తెలుగు జనమే ఎంటర్టైన్మెంట్ కోసం బాలీవుడ్ వైపు చూస్తున్నారా..? ఇదే జరుగుతోంది.