Home » Tag » JD Lakshmi Narayana
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ పార్టీ (Jai Bharath) పేరుతో ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. గత ఏడాదే ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయాలని నిర్ణయించారు. జై భారత్ పార్టీ తరపునే ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
జగనన్న సురక్ష కార్యక్రమంలో జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. కారణాలు ఏవైనా ఆ తర్వాత గ్లాస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సింగం సింగిల్ అనే రేంజ్లో ఒంటరిగానే పోరాడుతా.. ఒంటరిగానే పోరులో నిలబడతా అంటూ.. ఎన్నికలయుద్ధానికి సిద్ధం అవుతున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ.. ఇలా పార్టీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నా.. పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు ఆయన ! ఓట్ల ప్రకారమే తాను విశాఖలో ఓడిపోయానని.. జనాల నమ్మకం, ప్రేమ గెలుచుకోవడం సక్సెస్ అయ్యానని అంటున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.
విశాఖ.. రాజకీయానికి హార్ట్ ఇదే.. హాట్‌టాపిక్ ఇదే ! వేగంగా మారుతున్న పరిణామాలు.. సాగరతీరంలో రాజకీయాన్ని మరింత రంజుగా మారుతున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. టీడీపీ అయితే రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది ఇక్కడ ! ఇప్పటికే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే.. సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి ! రాజధాని ప్రకటన తర్వాత.. ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్.
జగన్ కేసుపై జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
జగన్ కేసు విచారణ సందర్భంగా నాటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు..? ఆయనకు బెదిరింపులు వచ్చాయా..? అసలా కేసు ఈయనకే ఎందుకు అప్పగించారు..?
గత ఎన్నికల సమయంలో జేడీ లక్ష్మినారాయణ జనసేన నుంచి విశాఖలో పోటీ చేశారు. అయితే ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఆయన పవన్ కల్యాణ్ కు ఎందుకు దూరమయ్యారనేది చాలా మందికి ఇప్పటికీ తెలీదు.