Home » Tag » JD(U)
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో NDA ప్రభుత్వం కొనసాగుతోంది అంటే... అది టీడీపీ, జేడీయూ చలవే. ఈ రెండు పార్టీలు లేకపోతే మూడోసారి నరేంద్రమోడీ అధికారం చేపట్టడం కష్టమయ్యేది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో... ఈ రెండు పార్టీలకు చెరో రెండు పదవులు ఇచ్చారు మోడీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై రెండు పార్టీలు పట్టుబడుతున్నాయని వార్తలు వచ్చినా... అవేమీ నిజం కాదని తేలిపోయింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) ముగిశాయి. వరుసగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ (Narendra Modi) మూడోసారి కూడీ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కేంద్ర కేబినెట్ (Union Cabinet) కొలువుదీరింది. ఇప్పుడు అందరి దృష్టీ లోక్ సభలో స్పీకర్ పోస్టుపై పడింది. టీడీపీ, జేడీయూ ఈ పోస్టును తమకు ఇవ్వాలంటే తమకు అని పట్టుబడుతున్నాయి.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఢిల్లీలోని పాత పార్లమెంట్ (Old Parliament) భవనంలో సెంట్రల్ హాల్ లో ఎన్డీయే కూటమి నేతలు భేటి అయ్యారు.
ఎన్డీయే కూటమి బలపడుతోంది. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడితే.. బీజేపీ అనుకూల పక్షాలు ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి.
మహారాష్ట్రలో గత ఏడాది శివసేను చీల్చి, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఎన్సీపీని చీల్చి, తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంను చేసింది. ఇదే తరహా ప్లాన్‌ను ఇప్పుడు బిహార్‌లోనూ అమలు చేస్తోందని విశ్లేషకుల అంచనా.
ఇన్నాళ్లూ తమలో ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీ గెలుస్తూ వచ్చిందని పార్టీలు గ్రహించాయి. ఇది ఇలాగే కొనసాగితే తమకు రాబోయే ఎన్నికల్లో కూడా విజయం దక్కడం కష్టమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.