Home » Tag » JIO tariffs
జనం అన్ లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు... మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు... నేను ఎంత పెంచినా కిక్కురుమనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవీగుతున్నారు జియో అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జీల మోత గురించే చర్చ జరుగుతోంది. జియో రీఛార్జీలును భారీగా పెంచడం చూసి... ఎయిర్ టెల్, ఐడియా కూడా పెంచిపారేశాయి. హయ్యస్ట్ గా 25 శాతం దాకా మొబైల్ రీఛార్జీల రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైమ్ లో అదును చూసి దెబ్బకొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతోంది.
ఒకప్పుడు ఫ్రీ అన్నాడు... ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు. ఇప్పుడేమో 27శాతం ఛార్జీల బాదుడు. జియో మొబైల్ రీఛార్జీలు అమాంతం పెరిగిపోతున్నాయి. జులై 3 నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగిపోతోంది. జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్స్ ని పూర్తిగా ఎత్తేశారు. ఓ వైపు అనంత్ అంబానీ పెళ్ళికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ముఖేష్... ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నావా అని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.