Home » Tag » jobs
ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది.
ఉద్యోగాల్లో మళ్ళీ కోత పెట్టింది టెక్ దిగ్గజం గూగుల్. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతపై కాస్త వెనక్కి తగ్గినా ... గూగుల్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈమధ్యే సరిగా పనిచేయడం లేదనీ, ప్రవర్తన సరిగా లేదంటూ 50 మందిని ఇంటికి పంపింది గూగుల్. ఇది జరిగి కొన్ని వారాలు కాకముందే మళ్ళీ జాబ్ లే ఆఫ్స్ ప్రకటించింది.
మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫెస్టో రూపొందించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపొందించింది. దేశ ప్రగతి, పేదలు, రైతులే, యువత, మహిళల అజెండాగా దీనిని రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
డిపార్ట్మెంట్లో పని చేసినప్పుడు ఉన్న కాంటాక్ట్స్ వాడుకుని అందరినీ నిజంగానే తాను పోలీస్ అని నమ్మించాడు. డిపార్ట్మెంట్తో తనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని.. డబ్బులిస్తే జాబ్ పెట్టిస్తానంటూ కొందరు అమాయకులను నమ్మించాడు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువత ఉద్యోగ కల్పన కోసం అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తాం.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ సెక్రెటరీ బుధవారం విడుదల చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
గత ప్రభుత్వం 5,089 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా.. రేవంత్ సర్కార్ అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి.. మొత్తం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దాదాపు రెండేళ్లక్రితం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, రెండేళ్లక్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాత నోటిషికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 6,100 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299, ఎస్టీజీ పోస్టులు 2280, పీజీటీ పోస్టులు 215, టీజీటీ పోస్టులు 1264, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.