Home » Tag » judicial remand
కవిత తీహార్ జైలుకు వెళ్తోంది అంటే.. అసలు అది ఎలా ఉంటుంది.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్. అంత డేంజర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. తీహార్ జైలు అంటే.. భయంకరమైన ప్రాంతమన్నది పెద్ద అపోహ.
కోర్టు ఆదేశాల తర్వాత.. అధికారులు వ్యానులో కవితను తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు ఆమె ఆ జైల్లోనే ఉండనున్నారు. ఐతే జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని.. జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.
చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్లో ఉండటం ఇదే మొదటిసారి. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వస్తున్నాయి. బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతీ సారి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది.
చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచాలని, లేదా ఇంటి భోజనం, మందులు ఇచ్చేలా జైలులో ఏర్పాట్లు చేయాలని కోరుతూ చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకొంటున్నాయి. మరోవైపు ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.
చంద్రబాబు లోకేష్ వ్యవహారాన్ని ప్రజలంతా చూశారు. శనివారం నుంచి టీడీపీ..శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ రూపకర్త, దర్శకత్వం అంతా చంద్రబాబే.
చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ల విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్ఐఆర్ నమోదైన టైంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ లూథ్రా ప్రశ్నించారు.
చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.