Home » Tag » jupally krishna rao
1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి గెలుపొందారు.
జూపల్లికి టిక్కెట్ ఇవ్వడాన్ని కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూపల్లికి టిక్కెట్ ఇచ్చినా సరే.. తను మాత్రం పోటీలో నిలుస్తానని చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ పెద్దలున్నారు.
సీట్ల పంపకాలు.. టీ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి కారణం అవుతున్నాయి. ఇప్పటికే సీట్ల కోసం దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో వాటి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేయడం హస్తం పార్టీ పెద్దలకు పెద్ద టాస్క్‌గా మారింది.
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, శ్రీ వర్ధన్ సహా ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
ఈ నెల 30న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. పాలమూరు ప్రజా భేరి పేరుతో, మూడు లక్షల మందితో సభ నిర్వహించాలనుకున్నారు.
ఈ నెల 25న వీరు కాంగ్రెస్‌లో చేరాల్సింది. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వచ్చే నెల 2న ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.
తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుధవారం ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
అందరూ అనుకున్నట్లుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ కాంగ్రెస్ సాధించిన విజయం.. బీజేపీ ఓటమి ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.
తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేక ఇంటర్వూ.
కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంత ముఖ్యమో.. బీజేపీకి అంతకుమించి ! కర్ణాటక ఫలితాలను చూపించి.. పక్క రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో సత్తా చాటాలని కమలం పార్టీ వ్యూహాలు రచించింది. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. కన్నడనాట ఘోర పరాభవం పలకరించింది.