Home » Tag » Justin Trudeau
గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. తమ దేశ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాదు.. భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది.
హిట్లర్‌తో కలిసి యూదులపై మారణకాండకు పాల్పడ్డ నాజీ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించాడు జస్టిన్ ట్రూడో. రెండో ప్రపంచ యుద్ధంలో, హిట్లర్ సైన్యంలో కీలక బాధ్యతలు పోషించిన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను కెనడా పార్లమెంటుకు ఆహ్వానించాడు జస్టిన్ ట్రూడో. అక్కడ, అతడికి కెనడా పార్లమెంట్ ఘన స్వాగతం పలికింది.
కెనడాలో ఖలిస్థాన్ చిచ్చు రాజేసిన ప్రధాని జస్టిన్ ట్రూడో అసలు వ్యూహం ఇదే. అక్కడి సిక్కుల జనాభా తోపాటూ వారి ప్రభావం అన్ని రంగాల్లో కీలకంగా మారింది. దీంతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఈ ఆరోపణను అస్త్రంగా చేసి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు వేదికగా ఈవిషయాలను భారత సర్కారు లేవనెత్తగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తోసిపుచ్చారు.
కెనడాలో సిక్కు వేర్పాటువాదుల 'ఆందోళనలు', భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఘటనలపై భారత ప్రధాని ఆగ్రహంగా ఉన్నారు. కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని జస్టిన్ ట్రూడో కూడా గతంలో అన్నారు.
ఇండియాకు వ్యతిరేకంగా, ఖలిస్తాన్ కోసం ఈ నెల 8న సిక్కులు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదట నిరసన చేపట్టనున్నారు. అలాగే భారత దౌత్యవేత్తలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
సోమవారం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాజాగా కెనడాలో భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేయాలని ఖలిస్తాన్ మద్దతుదారులు నిర్ణయించారు. దీనిపై ఇండియా.. కెనడాను ప్రశ్నించింది.