Home » Tag » K Kavitha
సెక్షన్ 164 కింద ఢిల్లీ రైజ్ ఎవెన్యూ కోర్టులో శరత్ రెడ్డి జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కాంకు సంబంధించ ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కాంలో జరిగిన మొత్తం విషయాన్ని ఒప్పుకున్నాడు.
11 పేజీలున్న పిటిషన్ లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనీ.. ఆప్‌కి వంద కోట్ల ముడుపులు కవితే చెల్లించినట్టు వివరించారు.
ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న నిందితులను.. మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.
ఇప్పటికే ఈడీ కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు సీబీఐ కూడా రెడీ అయ్యింది. ఇవన్నీ చూస్తే కవిత ఇక జైలుకే అంకితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో బెయిల్ కోసం కవిత పిటిషన్ ఇచ్చినా.. ఆమెకు కోర్టు నుంచి ఊరట మాత్రం లభించలేదు.
లిక్కర్ స్కాంలో ఈడీ కవితను అరెస్టు చేసి విచారించింది. అనంతరం ఈడీ వినతి ప్రకారం.. కవిత ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉంది. లిక్కర్ స్కాంలో కవితను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. నిజానికి.. గతంలోనే కవితను సీబీఐ విచారించింది.
కోర్టులో కవిత తరపు న్యాయవాది, ఈడీ తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు కవిత.