Home » Tag » Kadapa
అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైయాష్ రగడ తీవ్ర దుమారం రేపుతోంది. అప్రమత్తమైన అనంతపురం, కడప జిల్లాల పోలీసులు... ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీ రాజకీయాలు ఈసారి.. కుటుంబాల్లో చిచ్చు పెట్టాయ్. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగితే.. అన్నాచెల్లెళ్లు జగన్, షర్మిల మధ్య నిప్పులు పుట్టించింది రాజకీయం. ఏ అన్నను గెలిపించాలని ఒకప్పుడు వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారో.. ఇప్పుడు అదే అన్నకు ఎదురు తిరిగారు షర్మిల.
ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తిగా కనిపించడానికి ప్రధాన కారణం.. అన్నకు షర్మిల ఎదురుతిరగడం.. కాంగ్రెస్‌లో చేరి, పార్టీ పగ్గాలు అందుకొని.. కడప గడపలో పోటీ చేయడం.. దీనికితోడు లాస్ట్ మినిట్‌లో విజయమ్మ వీడియో బైట్ ఇచ్చి మరీ.. షర్మిలను గెలిపించాలని కోరడంతో.. కడపలో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. దీంతో మిగతా నియోజకవర్గాలన్నీ ఒకెత్తు.. కడప మాత్రం మరో ఎత్తు అనే స్థాయిలో కనిపించింది సీన్.
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయనకు రెండో భార్య ఉందని చెప్పేందుకు అవినాష్ వర్గం ప్రయత్నిస్తోంది.
ఇదీ పరిస్థితి. కడప (Kadapa) జిల్లా నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతీచోట వివేకా కూతురు సునీతతో కలిసి.. హత్య కేసును హైలైట్ చేస్తున్న షర్మిల.. అవినాశే హంతకుడని.. ఆ హంతకుడిని జగన్ కాపాడుతున్నాడని.. అందుకే కుటుంబానికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ.. చెప్తున్నారు. షర్మిల బస్సు యాత్రలకు జనాలు కూడా వస్తున్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆ కేసు విషయంలో ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా వివేకానంద భార్య సౌభాగ్యమ్మ... పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్నారు.
ఎమ్మెల్యేని బుజ్జగించేందుకు ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చినా.. అయితే నాకేంటి అన్నట్టుగా ఉన్నారట ఎమ్మెల్యే. ఇటు అమర్నాథ్రెడ్డి వర్గం కూడా దీటుగానే కౌంటర్ ఇస్తున్నట్టు తెలిసింది.
అలీకి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ కన్ఫమ్ అన్న టాక్ నడుస్తోంది. అలీ కూడా తాను పోటీకి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నాడు అలీ. గుంటూరు, నంద్యాల లేదా రాజమండ్రి.. వీటిల్లో ఏది ఇస్తారో వేచి చూడాలి.
తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని.. ఏపీలో ఎంటర్ అవనని పదేపదే చెప్పిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎలా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లు ఉంచినట్లుగా తెలుస్తోంది.
ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు.. నలుగురి ప్రాణం తీసింది ఓ వివాహేతర సంబంధం. కడప జిల్లా పులివెందుల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.