Home » Tag » Kadiyam Srihari
కడియం కుట్ర చేసి.. తనకు టికెట్ రాకుండా చేశారని రాజయ్య రగిలిపోయారు. ఐతే ఇప్పుడు ఎంపీ పోటీ రూపంలో.. తనకు మంచి చాన్స్ వచ్చిందని రాజయ్య ఫీల్ అవుతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కడియం కావ్యను ఓడిస్తే.. శ్రీహరి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంటుందని రాజయ్య భావిస్తున్నారు.
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కడియం కావ్యకు అడుగడునా ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీ మారినందుకు, కాంగ్రెస్‌లో జాయిన్ అయినందుకు కడియం శ్రీహరి, కావ్య.. అధికార, అపోజిషన్ పార్టీలకు శత్రువుగా మారారు.
మాజీ మంత్రి కడియం శ్రీహరికి బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి ఆఫర్లు రావడంతో.. ఆయన ఎక్కడ పార్టీకి దూరం అవుతారో అన్న భయంతో కడియం కావ్యకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దాంతో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది.
రాష్ట్రంలో ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. రాజకీయాల్లో ఇది సహజం. ఓటమి గురించి ఎక్కువ భాధ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్ మనదే. 2028లో అధికారం బీఆర్ఎస్దే. కాంగ్రెస్‌లో అపుడే కుమ్ములాటలు మొదలయ్యాయి.
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో కొంత కాలంగా రాజయ్య ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని, చివరి దశలో బీఫాం తనకే ఇస్తారంటూ అనుచరులకు చెప్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యతో ప్రత్యేక ఇంటర్వూ.
బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తులను ఏదో ఒక రకంగా దారికి తెచ్చుకునే క్రమంలో రాజీ ఫార్ములాలతో గులాబీ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ విజయానికి కలిసి పనిచేయాలని అసంతృప్తులతో సాగిన భేటీ ఫలించినట్లేనా.. కేటీఆర్ స్పష్టమైన హామీతో అభ్యర్థుల మధ్య సఖ్యత కుదిరినట్లేనా.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, అసంతృప్తులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరి కలిపోయారు. చేతులు కలుపుకున్నారు. శ్రీహరి కడుపు మీద చేయి పెట్టి మరీ.. తన ఆప్యాయత చూపించారు రాజయ్య. ఇదంతా బయటకు కనిపించే సీన్. నిజంగా ఇది నిజమా అంటే.. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటున్నారు రాజకీయాన్ని దగ్గరి నుంచి చూస్తున్న వాళ్లు!