Home » Tag » kakinada
సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి చెక్ పడుతోంది. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలకు కేరాఫ్ అయిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చుక్కలు చూపిస్తున్నారు.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రేషన్ ధాన్యం విదేశాలకు పంపిన కేసులతో పాటు ఇప్పుడు అక్రమ కట్టడాలపైనా యాక్షన్ మొదలైంది.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావంతో అలలు రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకోస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.
ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలైనా... ఉమ్మడి కృష్ణాజిల్లాలో అభ్యర్థులను ఫైనల్ చేయటంలో జనసేన (Janasena) మీన మేషాలు లెక్కిస్తోంది.
తంగెళ్ల ఉదయ్ వ్యాపారవేత్త. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫుడ్ చైన్ గ్రూప్.. టీ టైమ్ అధినేత. పవన్ వాడుతున్న వారాహి వాహనం కూడా ఉదయ్ పేరు మీదే ఉందని సమాచారం. ఆయన పిఠాపరం అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. కానీ, ఆ స్థానంలో పవన్ పోటీ చేస్తుండటంతో.. ఉదయ్‌కు కాకినాడ పార్లమెంట్ స్థానం కేటాయించారు.
ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3ఎంపీ సీట్లలో.. ఒక సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తోంది. ఐతే 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఇప్పటికే తమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది
పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్న పవన్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఐతే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. ఎంపీగా పోటీ చేయాలని కమలం పార్టీ పెద్దలు సూచించడంతోనే.. పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేనకు 24, బీజేపీకి 6 సీట్లు దక్కుతాయి. పార్లమెంట్‌కు సంబంధించి బీజేపీకి 6, జనసేనకు 2 సీట్లు దక్కనున్నాయి. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి.