Home » Tag » Kaleswaram
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై కాళేశ్వరం కమీషన్ సీరియస్ గా ఫోకస్ చేసింది. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో జరిగిన అక్రమాలను కాళేశ్వరం కమీషన్ త్వరలోనే బయటపెడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ (Mallanna Sagar) కి భూకంపం (Earthquake) ముప్పు పొంచి ఉంది. ఇదే ప్రతిపక్షాల ఆరోపణలు కాదు.. కాగ్ నివేదికలోనే ఈ దారుణం బయటపడింది. అసలు ఈ విషయం డ్యామ్ కట్టకముందే NGRI హెచ్చరించినా.. కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) ఆ రిపోర్ట్ ను ఖాతర్ చేయలేదు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్సుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామనీ... ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం..పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టు పురోగతిపై జలసౌధాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ENC మురళీధర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana Elections) ఏర్పడక ముందు వేళ్లలో ఉండే రాష్ట్రం అప్పులు.. కేసీఆర్ అధికారంలో 4 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి దివాలా తీయించి.. కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్లు కాజేశారు.