Home » Tag » Kalvakuntla Kavitha
లిక్కర్ కేసులో మాజీ ఎంపీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గంటన్నర నుంచి సుప్రీం కోర్టులో వాడీ వేడి వాదనలు జరగగా ఈడీపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది.
BRS MLC కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఏప్రిల్ 15కి నెల రోజులైంది. మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపి, ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవితను తీసుకెళ్ళేటప్పుడు... తల్లి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు... ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితను (MLC Kalvakuntla Kavitha) మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ను ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో సీబీఐ కస్టడీ (CBI Custody) ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్ ద్వారా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని కవిత భావిస్తున్నారట. ఈక్రమంలో తనకు రెడ్ కార్పెట్ పరిచేలా ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కోసం వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్గా పర్యటిస్తున్నారు.
కొంతమంది పనిగట్టుకుని కేసీఆర్ ను బద్నాం చేయడానికి ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ బిడ్డలం తలవంచబోమని.. తెగించి కొట్లాడతామని స్పష్టం చేశారు. ఎవరో ఆర్థిక నేరస్థుడు ఒక లేఖ రాస్తే దానిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని బట్టి చూస్తే దీని వెనుక ఎవరి కుట్ర ఉందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు కవిత.
20 న కూడా ఈడీ విచారణకు వెళ్లకూడదనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో KTR, కవిత మధ్య వాదోపవాదాలు జరిగాయని సమాచారం. ఈడీ విచారణను ఎదుర్కొవడమే మంచిదని... తెగే వరకు లాగొద్దని KTR ఇచ్చిన సూచనను కవిత కొట్టిపడేసారట.
ఈడీ అంచనాలు నిజం అయితే.. నిజంగా నిజాలు బయటకు వస్తే.. లిక్కర్ స్కామ్ ఉచ్చు కవిత చుట్టు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఆ ఫోన్లో ఏముంది.. ఆ ఫోన్ ఎక్కడుందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తోంది.
కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి...అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు.