Home » Tag » Kamma
ఫస్ట్ లిస్ట్‌లో సొంత సామాజికవర్గానికే చంద్రబాబు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నారు. కమ్మ నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించారు. ఆ సామాజికవర్గంతో కంపేర్ చేస్తే.. బీసీలు, మైనారిటీలకు టీడీపీ టికెట్ల కేటాయింపులో మళ్లీ అన్యాయమే చేసినట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కుల సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ పుట్టినప్పటి నుంచి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు... ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వైసీపీకి కొమ్ముగాసిన రెడ్లు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. ముద్రగడ చేరికతో జనసేనకు కాపులు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. గతంలో పక్కాగా ఈ కులం వాళ్ళు ఈ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కులం నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.
అందరూ ప్యాకేజ్ స్టార్.. ప్యాకేజ్ స్టార్.. అంటే ఏదో ప్రచారం కోసం అబద్ధాలు చెబుతున్నారు లే అనుకున్నాం. కానీ ఎన్నికలు ఎప్పుడైనా సరే.. చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అని లోకేష్ కరాకండిగా చెప్పిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అర్థమైంది.
గుడివాడలో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం ఓట్లతోనే గెలుస్తున్నారనుకుంటే పొరపాటే. నానిని ఓడించాలంటే కమ్మ ఓట్లకు కాపులో, యాదవులో తోడవ్వాలి. అయితే స్థానిక పరిస్థితులను గమనిస్తే అది అసాధ్యం.