Home » Tag » Kapu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కుల సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ పుట్టినప్పటి నుంచి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు... ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వైసీపీకి కొమ్ముగాసిన రెడ్లు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. ముద్రగడ చేరికతో జనసేనకు కాపులు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. గతంలో పక్కాగా ఈ కులం వాళ్ళు ఈ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కులం నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.
కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ.. టీడీపీ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యమం ఊసే లేదు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ముద్రగడ.. ప్రస్తుతం పొలిటికల్ ఉక్కపోత భరించలేక ఫ్యాన్ కిందికి రావాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినా.. పార్టీ పెద్దలు మాత్రం ఆయనను వేరే విధంగా కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని పక్కన పెట్టేసింది అధికార పార్టీ. ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.
గుడివాడలో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం ఓట్లతోనే గెలుస్తున్నారనుకుంటే పొరపాటే. నానిని ఓడించాలంటే కమ్మ ఓట్లకు కాపులో, యాదవులో తోడవ్వాలి. అయితే స్థానిక పరిస్థితులను గమనిస్తే అది అసాధ్యం.