Home » Tag » Karnataka CM
మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేయదు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంది.
విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‌తో పేకాడేస్తుంటాడీ వర్సటైల్ హీరో. హీరోగా మాత్రమే కాదు.. విలన్‌గా, గెస్ట్ రోల్, కేరక్టర్ ఆర్టిస్టుగా.. పాత్రలో దమ్ము ఉండాలే కానీ.. తన ఇమేజ్ను కూడా పక్కన పెట్టి.. యాక్టింగ్‌కు సై అంటాడు.
బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ 'బాహుబలి బాహుబలి' అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్ అయ్యింది.
కేసీఆర్ తెలివితేటలకే చెక్ పెట్టేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన హస్తంపార్టీ.. క్రమక్రమంగా తెలంగాణవైపు ఫోకస్ పెంచింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను పిలవగా అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక బాధ.. వెళ్లకపోతే మరో బాధ..!
సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో వీరిలో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది అధిష్టానం. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.