Home » Tag » KARNATAKA ELECTIONS
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుంటుంది జాతీయ పార్టీల తీరు. రాష్ట్ర నేతలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తే నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం హైకమాండ్‌దే. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు పార్టీలది అదే తీరు.
కర్ణాటక ఫలితాలు.. పక్క రాష్ట్రంలోనూ రాజకీయాలను షేక్ చేస్తున్నాయ్. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆ రిజల్ట్ తాలుకూ మార్పులు కనిపిస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. 20రోజుల వ్యవధిలో కేసీఆర్ రెండోసారి బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ముందస్తు ఉండదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చాలాసార్లు చెప్పారు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు ఇంత అత్యవసరంగా మీటింగ్ ఎందుకు. అదీ 20రోజుల వ్యవధిలో ఎందుకు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పార్టీలు నెమ్మదిగా పక్కకు తప్పుకొన్నాయి. దీంతో కాంగ్రెస్ అటు సొంతంగా ఎదగలేక.. ఇటు మిత్రపక్షాల మద్దతు లేక చతికిలపడిపోయింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తిరిగి గత వైభవాన్ని సాధిస్తుందా అనిపిస్తోంది.
ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి.. ప్రతీచోటా చెప్పిన సోదే చెబితే ప్రజలు ఈడ్చి ఈడ్చి ఇంటికి పంపిస్తారు. బీజేపీకి ఇప్పటికే ఈ విషయం అర్థమయ్యే ఉండాలి!
ఎక్కడ ఎవరు గెలుస్తారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. అధికారంలోకి వచ్చేపార్టీ ఏంటి.. మెజారిటీ ఎంత.. ఇలా రకరకాల ప్రశ్నలు జనాలను వెంటాతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
కర్నాటక ఎన్నికల నేపథ్యంలో రాహూల్ గాంధీ ఫుడ్ డెలివరీ బాయ్స్ తో సరదాగా గడిపారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ.
ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్త్రాలతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. మరి కన్నడ నాటి మళ్లీ కమలం వికసిస్తుందా.? కాంగ్రెస్ కోలుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా..? జేడీఎస్ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.?
కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.