Home » Tag » Karnataka Politics
కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన స్ట్రాటజీనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తోంది. దీనిపై పూర్తిస్థియిలో వ్యూహాలను సిద్దం చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా.. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో కేసీఆర్ పార్టీకి ఓట్లు పడటానికి "తెలంగాణ సెంటిమెంట్" బాగా హెల్ప్ చేసిందనేది క్లియర్ కట్ అంశం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అది వర్క్ అవుట్ కాదని.. తమకు మాత్రమే పనికొస్తుందనే ఒపీనియన్ తో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.
తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌కు కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు.
ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.
ఏ పార్టీయైనా ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించాలి. అందరి అభిప్రాయాలకు పెద్ద పీట వేయాలి. లేకపోతే పార్టీతో పాటు వ్యక్తులు కూడా నియంతలుగా మారతారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందరూ హైకమాండ్ జపం చేస్తారు గానీ.. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్యం ఏస్థాయిలో ఉంటుందంటే నిత్యం గాంధీ కుటుంబం పేరు జపించేవాళ్లు కూడా తమకు అనుకూలంగా పరిణామాలు లేకపోతే తిరుగుబాటు చేసే స్థాయి వరకు వెళ్తారు. దటీజ్ కాంగ్రెస్.
బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ 'బాహుబలి బాహుబలి' అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్ అయ్యింది.
కర్నాటక సీఎం ఎంపిక ఎపిసోడ్లో ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర పడింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను కీలక మలుపులు తిప్పుతున్నాయ్. నిజమో.. అబద్దమో కానీ.. బీజేపీకి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కమలం పార్టీ స్ట్రాటజీలు మార్చుకుంటోంది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో జనసేనతో పొత్తు కాని పొత్తులో ఉన్న కమలం పార్టీ.. ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. అదే హాట్‌టాపిక్ అవుతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు హల్చల్ చేస్తున్నాయి. అవి ఫేక్ అని తెలుసుకోకుండా చాలా మంది షేర్లు చేసి పడేస్తున్నారు. తీరా అది అబద్ధమని తెలిసేలోపే మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.