Home » Tag » Kaushik Reddy
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బాస్టర్ మాదిరిగా మారారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేశారు ఇద్దరు నేతలు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇంటి వరకు వెళ్ళింది. అరికేపూడి గాంధీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయగా... దాన్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు.
ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు.
వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. త్వరలోనే కౌశిక్ రెడ్డి తన సొంత గూటికి తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలంగా వరుసగా పార్టీ మారుతున్నారు. రోజుకు ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 24 మంది మీద 30 దాకా పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు. అఫిడవిటల్స్ లో తప్పులు, ఈవీఎంలు, వీవీ పాట్స్ లో లోపాలు లాంటి కారణాలతో ఈ పిటిషన్లు ఫైల్ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు ఈనెల 29న ఎన్నికల జరగబోతోంది. ఈ రెండూ కాంగ్రెస్ కే దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాల జరిగే ఈ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) , మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్లను AICC ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈనెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.
తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య నామ మాత్రమే. దీంతో కీలకమైన బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అట్నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదా.. చేయాలనుకున్న పనులను అనుకున్నట్టుగా చేయలేకపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కొందరు నేతలు.. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వాళ్లు ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకూడదు. దీంతో వరుసగా తమ పాత పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.