Home » Tag » Kavitha Arrest?
తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు కేసీఆర్ వెంటే తిరిగిన చాలా మంది నేతలు.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పార్టీ మారిపోతున్నారు. టికెట్ ఇస్తాం అన్నా కూడా పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు అంటే.. బీఆర్ఎస్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఏడుగురు అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపింది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఇంట్లో సెర్చింగ్ చేశారు. కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు.
ఇప్పుడు కవితను విడిచి పెట్టినంత మాత్రాన ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా..? ఇక కవితను అరెస్ట్ చేయరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
కవితను అరెస్ట్ చేస్తే... ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడో జరిగే పరిణామానికి ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టే కేసీఆర్.. కవిత వ్యవహారంలో స్ట్రాంగ్ వ్యూహమే రెడీ చేసి ఉంటారన్నది మరికొందిరి అభిప్రాయం.
ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ప్రయోగిస్తోంది. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ముందరికాళ్లకు బంధం వేసినట్లే. కేసీఆర్ ఎక్కడికెళ్లినా కవిత ఇష్యూకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ ను వ్యూహాత్మకంగా బంధిస్తోంది బీజేపీ.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తను అరెస్ట్ అయితే వీలైనంత మైలేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే కవిత ఇలా హడావుడి చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ.
కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం, 10న అరెస్టుకు రావాలని ఆదేశించడంతో ఆమెను అరెస్టు చేయబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
KCR కుమార్తె ... MLC కవిత హఠాత్తుగా 3, 4 ఛానెల్స్ కి, పేపర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పటి లాగే కేంద్రాన్ని, బీజేపీని దుమ్మెత్తి పోశారు. కవిత ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ బాగా జరుగుతోంది.