Home » Tag » Kavya Maran
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా... ఐపీఎల్ లాంటి మెగా లీగ్ లో అయితే బ్యాటర్ల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు.. ముఖ్యంగా గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలితే... మరికొందరు స్టార్ ప్లేయర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఎవ్వరూ ఊహించని విధంగా కొందరు సీనియర్ ఆటగాళ్ళకు సైతం మంచి ధరే పలికింది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధరకు అమ్ముడయ్యాడు.
రెండ్రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మెగావేలం పూర్తయింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే బిజీలో ఉంటే క్రికెట్ అభిమానులు మాత్రం వేలంలో పాల్గొన్న అందమైన అమ్మాయిలను చూస్తూ ఉండిపోయారు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఆటగాళ్ళ ఫామ్ , ఫిట్ నెస్ తో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకుని కొనుగోళ్ళు చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చాయి.
ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మెగా వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకోగా.. కేవలం 45 కోట్ల పర్స్ వ్యాల్యూ తో వేలంలోకి వచ్చింది.
ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొందరు బ్యూటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా... పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతాతో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా మెగావేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐపీఎల్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిరోజు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ తనదైన మార్క్ తో ఏడుగురు ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో పక్కా వ్యూహంతో బరిలోకి దిగినట్టు కనిపిస్తోంది. తమ పర్స్ లో ఉన్న 45 కోట్లతో చాలా తెలివిగా ప్లేయర్స్ ను తీసుకుంటోంది.
ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది. జెడ్డా వేదికగా జరగబోయే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంచైజీలన్నీ తమ తమ వ్యూహాలతో రెడీ అయ్యాయి.
ఐపీఎల్ మెగావేలానికి ముందు విదేశీ ప్లేయర్స్ కు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. వేలంలో రిజిష్టర్ చేసుకుని అమ్ముడైతే ఖచ్చితంగా సీజన్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది.