Home » Tag » keshineni nani
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని...స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న (Buddha Venkanna) టీంతో పొసగక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్లో విమర్శలు చేసిన నాని... చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానికి పొమ్మనలేక పొగబెట్టింది టీడీపీ అధిష్టానం. దాంతో ఆయన ఇప్పుడు కొత్త పార్టీని వెతుక్కునే పనిలో ఉన్నారు. కానీ టీడీపీలోనే కొనసాగుతున్న ఆయన కేడర్ మాత్రం అయోమయంలో పడ్డారు. గతంలో నాని అండ చూసుకొని.. పార్టీ ఇంఛార్జుల మీద రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడేం చేయాలని అయోమయంలో ఉన్నారు.
ఆయన తనని తాను చాలా గొప్పవాడినని అనుకుంటాడు. పార్టీతో పని లేకుండా ఎదిగిపోయానని భావిస్తాడు. పార్టీ జెండా, అధినేత బొమ్మ అవసరం లేకుండా సొంత ఇమేజ్ తో గెలిచాను అనుకుంటాడు. అక్కడితో ఆగడు.. ఎవ్వడినైనా పూచిక పుల్లలా తీసి పడేస్తాడు. వాడెంత? వీడెంత..? అని గప్పాలు కొడుతూ ఉంటాడు. ఈయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది.. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని... విజయవాడ ఎంపీ. తెలుగుదేశంతో నాని అనుబంధం అంతా కలిసి పదేళ్లు మాత్రమే.
బెజవాడ ఎంపీ సీటుపై దాదాపు ఏడాదిన్నర నుంచి నలుగుతున్న వ్యవహారానికి తెరదించింది టీడీపీ అధినాయకత్వం. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. నేరుగా చెప్పకున్నా.. ఆయన సోదరుడు చిన్నికి లైన్ క్లియర్ చేసింది. దీంతో ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని. దీంతో కొందరిలో రిలీఫ్ కనబడినా.. నాని స్వభావం తెలిసినవారు.. ఆయన్ను దగ్గరుండి చూసిన వారిలో మాత్రం భవిష్యత్తులో బాంబ్ బ్లాస్ట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై చాలాసార్లు నాని విరుచుకుపడ్డారు.