Home » Tag » kesineni nani
ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై 'బండి బోరుకొచ్చింది. షెడ్డు మారింది అంతే' అంటూ సెటైర్లు వేశారు PVP. ఇప్పుడు ఇంకో ట్వీట్ Xలో పెట్టడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు.
లోకేశ్ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు నాని. ఐతే ఆయనతో పాటు చాలామంది సీనియర్లు.. లోకేశ్ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది.
తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని నాని.. ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాని వాట్ నెక్స్ట్ అనే మాట బెజవాడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నది.
టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాలతో ఆ పార్టీని వీడాలని విజయవాడ ఎంపీ కేశినేని నిర్ణయించారు. త్వరలోనే ఎంపీ పదవికి, టీడీపీకి త్వరలో రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు. తిరువూరులో అన్నదమ్ములు కేశినేని నాని-చిన్ని మధ్య విభేదాలు తీవ్రం కావడంతో చివరకు పార్టీని వీడాలని నాని నిర్ణయించారు.
ఏపీలోని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈనెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభ బాధ్యతలను కూడా కేశినేని చిన్నికి అప్పగించింది. ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా బాబు వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తిరువూరు టీడీపీ మీటింగ్ లో ఎంపీ కేశినేని నాని వర్గీయులు... నానా రచ్చ చేయడమే ఇందుక్కారణం.
తాను పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్న నాని.. ఈ మధ్య డైలాగ్‌ల్లో ఘాటు పెంచారు. రోజుకో స్టేట్మెంట్తో నాని పిచ్చెక్కిస్తున్నారు. ఏ రోజు ఎవరి టార్గెట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఓసారి డైరెక్ట్‌గా చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తే.. మరోసారి తన వ్యతిరేకుల మీద విరుచుకుపడతారు.
తీర్పు కోసం బాబు వెయిట్ చేస్తున్న టైంలో కూడా నాని ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో కేశినేని పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్ పడినట్టైంది.
నారా లోకేష్ ఈ పేరు వినగానే చంద్రబాబు నాయుడు తనయుడు అని ముద్రవేసుకున్నారు. గత కొన్ని నెలలుగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్ర గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. ఇదే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు తెలుసుకుందాం.
బెజవాడ పాలిటిక్స్ హీట్ పీక్స్‌కు చేరింది. ఎంపీ కేసినేని నాని తాజాగా చేసిన 'గొట్టంగాళ్లు' కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఇంతకి కేశినేని దృష్టిలో ఎవరా గొట్టంగాళ్లు..?
కొంతకాలంగా టీడీపీకి తలపోటుగా మారింది కేశినేని నాని వ్యవహారం. ఆయన ఉన్నా లేనట్లే అన్నట్లు ఉన్నారు ఇన్నాళ్లు ! ఇప్పుడు ఉండి.. ఇకపై ఉండను అని సంకేతాలు పంపుతున్నారు.