Home » Tag » Kiran Kumar Reddy
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అడుగు పెట్టనున్నారా...? ఖాళీ ఉన్న మంత్రి పదవి విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది...? ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... బాబు ముందు ఉంచిన ప్రతిపాదన ఏంటీ...?
టీడీపీతో బీజేపీ పొత్తు దాదాపు ఖాయమని అనుకుంటున్న టైంలో పార్టీ ముఖ్య నేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఎవరెవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన కూడా వస్తోంది.
కాషాయ కండువా కప్పుకున్న కొద్దికాలానికే కిరణ్‌ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రకటించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆయన ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పని చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఏపీకి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకను నిరసిస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ఉపాధి లేకుండా పోయింది. జై సమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టి.. ఆ తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లాడు. అక్కడా భవిష్యత్ లేదని డిసైడ్ అయి.. చివరకు బీజేపీలో చేరారు.
మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కలత చెంది కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. జై సమైక్యాంధ్ర అని పార్టీ పెట్టి చేతులు కాల్చుకొని.. తప్పు జరిగిందని మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి.. హస్తం కూడా కరెక్ట్‌గా లేదు అని ఇప్పుడు కమలం కండువా కప్పుకున్నారు మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ మీద ఘాటు విమర్శలు చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని టాక్ నడుస్తోంది. నేడోరేపో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని చెప్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి ఏంటి ఉపయోగం అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.