Home » Tag » KKR
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ఇటు బీసీసీఐ నుంచి అటు ఫ్రాంచైజీల వరకూ... ఇటు ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఇది... ఇలాంటి టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ క్రికెటర్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాడు.
ఐపీఎల్ మెగావేలం ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ కొత్త కెప్టెన్, జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. వచ్చే సీజన్ లో పలు జట్లకు కొత్త సారథులు రాబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సైతం కొత్త కెప్టెన్ తోనే వచ్చే సీజన్ లో బరిలోకి దిగబోతోంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. గతేడాది కేకేఆర్ ని ఛాంపియన్‌గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతుంది. జట్టులో రసెల్, నరైన్ లాంటి సీనియర్లుగా ఉన్నారు.
ఐపీఎల్ మెగావేలం తంతు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. పలు టీమ్స్ కొత్త ప్లేయర్స్ ను తీసుకోవడంతో పాటు కొత్త కెప్టెన్లనూ ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ చాలామంది ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసింది.
ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి వేలంలోకి పలువురు కెప్టెన్లు రావడంతో ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ ఖాయమైపోయింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కోసం ఓ రేంజ్ లో ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.
భారత క్రికెట్ జట్టుకు ఆడడం ప్రతీ ఆటగాడి కల... గతంలో ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలా కొద్ది మందికే అవకాశం దక్కేది. దేశవాళీ క్రికెట్ లో రాణించినా కూడా ఎంతో పోటీ ఉండడంతో 15 మందిలో చోటు దక్కించుకోవడం అంటే చాలా కష్టం... అలాంటిది ఐపీఎల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.
ఐపీఎల్ మెగావేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ వచ్చేయడంతో ఈ సారి అన్ని జట్ల కూర్పూ మారిపోవడం ఖాయమైంది. అలాగే కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా రాబోతున్నారు. రిషబ్ పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కొత్త సారథిని వెతుక్కుంటోంది.
ఐపీఎల్ రిటెన్షన్ జాబితా గడువు దగ్గరపడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా పలువురు స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ అవకాశం ఉండగా.. ఈ సారి మాత్రం ఫ్రాంచైజీలకు మేలు చేసేలా ఆరుగురికి అవకాశమిచ్చారు.
ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్ లో భారీ మార్పులు ఉండకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళను వేలంలోకి వదిలివేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో తమ ఆటగాళ్ళను వదిలేసినా మళ్ళీ తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నంలో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి.