Home » Tag » Kodandaram
తెలంగాణలో గవర్నర్ (Telangana Governor) కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
ఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోదండరాంతోపాటు అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది.
ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండడంతో.. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిటిషన్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ విద్యాశాఖలో యేళ్ళ తరబడి అనుభవం ఉన్న వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్చరర్ గా.. ప్రొఫెసర్ గా విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తికి ఈ పోస్ట్ ఇస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో TJS అధ్యక్షుడు కోదండరామ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి ఈమధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేసి.. విద్యాశాఖ అప్పజెప్పాలని రేవంత్ నిర్ణయించారు.
సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రేవంత్ తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వర్గాలను.. ఉద్యమకారులకు పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణపై నిజమైన చిత్తశుద్ధి ఉంది తమకే అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనక.. కోదండరాం సూచనలు ఎన్నో ఉన్నాయ్. తనకు ప్రత్యేకంగా పార్టీ ఉన్నా..
ఎన్నికల సమయంలో వివిధ పార్టీల మద్దతు తీసుకుంది కాంగ్రెస్. కొన్ని పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగా.. మరికొన్ని పార్టీలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని ఒప్పించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ నుంచి తప్పుకుంది. AICC పెద్దలతో పాటు PCC చీఫ్ రేవంత్ రెడ్డి, తదితరులు TJS ఆఫీసుకు స్వయంగా వెళ్ళి.. ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒప్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఉద్యమ నేత టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బోసు రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కోదండ రామ్ తో భేటీ అయ్యామని చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి.