Home » Tag » Kodangal
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ కూలుతుందా ? బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ?
తెలంగాణలో రాజకీయ (Telangana Politics) పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections), అధికార మార్పిడి తర్వాత జంపింగ్ జపాంగ్‌ల జోరు పెరుగుతోంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు అన్న పద్యాన్ని నరనరానా జీర్ణించుకున్న నాయకులు... పవరున్న పార్టీవైపు పరుగులు పెడుతున్నారు. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి.
దీంతో రేవంత్ ఇంటి వద్ద సందడి, పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సందడి నెలకొంది. తమ నియోజకవర్గం నుంచి రేవంత్ సీఎం అవుతున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎంపికయ్యారు. ఈ నెల 7, గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ జీవితంలోని కీలక ఘట్టాలివి.
షూస్ వేసుకొని గోమాతకు పూజలు.. చేసిన టీపీసీసీ ఛీప్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
గజ్వేల్‌లో కేసీఆర్ మీద ఈటల పోటీ చేస్తుంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీ అంటున్నారు రేవంత్. కామారెడ్డిలో కేసీఆర్‌ను రేవంత్ ఓడిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం అని.. కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన కేసీఆర్... ఆయనపై విమర్శల దాడికి దిగారు. రేవంత్ లాగు ఊడే దాకా కొట్టాలని జనానికి పిలుపు ఇచ్చారు. ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ని ఓడించాలని పిలుపు ఇచ్చారు.
తెలంగాణ (Telangana) ఎప్పుడూ చూడని పరిణామాలు ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. కేసీఆర్ (KCR) ను టార్గెట్ చేసిన విపక్షాలు.. ఆయన మీద పోటీకి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నారు.
షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకున్న నేతల్లో రేవంత్ ఒకరు. ఆయన షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ షర్మిల పార్టీని విలీనానికి ఒప్పుకోలేదు.
తాజాగా కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టిక్కెట్ దొరకని వాళ్లు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. వారిలో ఉప్పల్ నియోజకవర్గం నేత సోమశేఖర్ రెడ్డి ఒకరు. రేవంత్ అనుచరుడిగా పేరున్న సోమశేఖర్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.