Home » Tag » Komatireddy Venkat Reddy
అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. మేడిగడ్డ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కేసీఆర్ సర్కార్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుండగా.. బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది.
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. ప్రమాణ స్వీకార అనంతరం రేవంత్ సచివాలయానికి బయల్దేరారు.
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ లో మంచి ఊపు కనిపిస్తోంది. రాబోయేది కాంగ్రేస్ సర్కారే అని ఇతర పార్టీల్లో చాలామంది ప్రముఖులు చేతిని అందుకుంటున్నారు. మరోవైపు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని ఇప్పుడొచ్చిన కొత్త వాళ్ళకి టిక్కెట్ ఇస్తారా .. అని బెదిరించి రాజీనామాలు చేస్తున్నారు మరికొందరు. అందుకే అటు వచ్చేవాళ్ళని కాదనకుండా.. ఇటు పార్టీ నుంచి బయటకు వెళ్లే వాళ్ళని బుజ్జగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఫటా ఫట్ ప్లాన్ అప్లయ్ చేస్తోంది. ప్రతి రెండు, మూడు రోజులకోసారి కొత్త లీడర్ ని చేర్చుకోవడానికి స్కెచ్చేసిన.
కొంతకాలంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీని వెనుక తన పార్టీకే చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఉన్నారని, ఆయనే తనపై కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు.
ఉచిత కరెంట్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ అలా అనకుండా ఉండాల్సిందంటూ ఆయనపై హస్తం నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోంది. అయినా ఆయనపై చర్యలు తీసుకునే సీన్ ఆ పార్టీకి లేదు. పైగా పార్టీలోని సీనియర్లు ఆయన్ను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీకి పెద్ద బూస్ట్ ఇస్తున్నాయి. ఆ రెండు పార్టీల్లో దేనికి ఓటేసినా అది కేసీఆర్ కు వేసినట్టేననే ప్రచారం మొదలు పెట్టింది.
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి కల్లోలం రేపారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీని వాడుకుంటున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుస్తుందనే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.