Home » Tag » Konda Surekha
మంత్రి కొండ సురేఖ పై తాను వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రి కొండ సురేఖ పై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరపనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ దావా పిటిషన్ ను కేటిఆర్ దాఖలు చేసారు. నేడు పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారణ జరపనుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమయ్యారు...? రాష్ట్రంలో రాజకీయం రగులుతున్న వేళ ఎందుకు మౌనముద్ర పాటిస్తున్నారు...? అసలు కేసీఆర్ జనానికి కనిపించి ఎన్ని రోజులైంది...? పదవి కోసం కేసీఆర్ ను కేటీఆర్ ఏదో చేసి ఉంటారన్న కొండా సురేఖ వ్యాఖ్యల వెనక అర్థమేంటి,,,?
అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖపై కోర్ట్ లో పరువు నష్టం దావా వేయగా దానిపై కాంగ్రెస్ న్యాయ విభాగం స్పందించింది. కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు.
సమంత నాగచైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో రచ్చ లేపాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి సామాన్యులు కూడా వాడని భాషను భావాన్ని వాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం సీరియస్ అయ్యింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అక్కినేని కుటుంబానికి, వారి మాజీ కోడలు సమంతాకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి.
తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరో... అక్కినేని నాగేశ్వరరావు. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం, ధనిక కుటుంబం కూడా. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు, దేశ వ్యాప్తంగా వ్యాపారాలు ఇలా కంప్లీట్ సక్సెస్.
రాజకీయాల్లో కొందరు నేతలు నిత్యం వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొందరు నేతలు నోటి దురుసును ప్రదర్శిస్తారు. అలాంటి కోవలోకే వస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తండ్రి కేసీఆర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్.
ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా...బుల్లెట్ దిగిందా ? లేదా ? అన్నది సినిమా డైలాగ్. దీన్ని రాజకీయాలకు అన్వయించుకుంటే మాత్రం...ఎవరికైనా సరే పరాభవం తప్పదు. రాజకీయాల్లో అనుభవం పెరిగితే కొద్దీ...పరిపక్వత అదే స్థాయిలో ఉంటుంది.