Home » Tag » Kumara Swami
సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందో లేదో కానీ.. తెలంగాణ, ఏపీ మీద మాత్రం పక్కాగా కనిపిస్తుంది ఎఫెక్ట్. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఫలితాలను ఆసక్తిగా గమనించింది అందుకే ! జంపింగ్ చేద్దామనుకున్నవాళ్లు.. కర్ణాటక ఫలితాల కోసమే ఆగిపోయారు కూడా ! మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ మాత్రం కర్ణాటక ఫలితాలపై కోట్ల ఆశలు పెట్టుకుంది.
కర్ణాటక ఎన్నికలకు ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది దేశమంతా ! మళ్లీ ఓడిపోతో ఉనికి కోల్పోతామన్న భయంతో ఓ పార్టీ చేస్తున్న పోరాటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని మరో పార్టీ ఆరాటం.. కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయ్. కర్ణాటక ఎన్నికలు.. పక్క రాష్ట్రాల రాజకీయాలను, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయ్. అందుకే ఇప్పుడు దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ.
ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.
కన్నడ రాజకీయాలు కాకమీద కనిపిస్తున్నాయ్. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. కమలాన్ని కొట్టాలని కాంగ్రెస్.. సత్తాచాటాలని జేడీఎస్.. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు ఒకవైపు.. సినీ కలరింగ్ మరోవైపు.. కాంగ్రెస్ దూకుడు ఇంకోవైపు.. తగ్గేదే లే అంటున్న జేడీఎస్ మరోవైపు.. ఇలాంటి పరిణామాలతో కర్నాటక రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయ్. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కోల్పోయేందుకు కూడా పార్టీలు సిద్ధంగా కనిపించడం లేదు.
కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్త్రాలతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. మరి కన్నడ నాటి మళ్లీ కమలం వికసిస్తుందా.? కాంగ్రెస్ కోలుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా..? జేడీఎస్ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.?