Home » Tag » Kumaraswamy
ఏపీలో ఏన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం హోదాలో వరుసగా జిల్లాల పర్యటనకు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడుపుతున్నారు.
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారం పైనే ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో విద్యుత్ సప్లయ్ కి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక (Karnataka) లో ఏం వెలగబెడుతుందో గమనించాలని BRS కోరుతోంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల పవర్ ఇవ్వడానికి దిక్కులేదని.. తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయితే.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. ఇదే టైమ్ లో కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరాకటంలోని నెట్టాయి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో కర్నాటకలో విజయం ఆ పార్టీకి నైతికంగా ఎంతో బలాన్నిచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు, ఈ ఏడాదిలో జరగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక విజయం కచ్చితంగా బాటలు పరుస్తుంది.
ఢిల్లీని ఏలుతామని ప్రతిన చేసిన కేసీఆర్.. ఎందుకు పక్క రాష్ట్రం ఎన్నికలపై మౌనంగా ఉన్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఐతే కర్ణాటక మీద కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. పొత్తుల సంగతి తర్వాత.. పోటీ మాట కూడా ఎత్తడం లేదు.