Home » Tag » kuppam
వైసీపీ హయాంలో కన్నూ మిన్నూ కానకుండా... చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నే కాదు... ప్రతిపక్ష మహిళా నేతల్నీ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ఏరియాను ఓ సామంత రాజులాగా పాలించారు.
వాలంటీర్లుగా ఉంటూ ప్రభుత్వం కోసం పని చేయడం సాధ్యం కాదు కాబట్టి.. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా వాలంటీర్లు రాజీనామా చేశారు.
వై నాట్ 175 (Y Nat 175) లక్ష్యంగా ముందుకు సాగుతోన్న వైసీపీ (YCP)ఆ నాలుగు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న ఆ స్థానాల్లో దూకుడుగా వెళుతోంది.
చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని.. వైసీపీ వేస్తున్న ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం సాధ్యం అయ్యే పనేనా అనే చర్చ జరుగుతున్నా.. అసలు కుప్పంలో గ్రౌండ్లెవల్ రియాలిటీ ఏంటి అనే దానిపై.. తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
కుప్పంకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు.? ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు. కుప్పంకు చంద్రబాబు 34 ఏళ్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. అయినా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు.
35 యేళ్ళుగా చంద్రబాబుని కుప్పంలో గెలిపిస్తున్నారు.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం.. నేను నిల్చుంటా.. నన్ను గెలిపిస్తారా.. అంటూ సరదాగా మాట్లాడారు నారా భువనేశ్వరి. అంతే వైసీపీ లీడర్లు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైసీపీకి ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను తెలుగుదేశం రెడీ చేసింది. ఇరవై లేదా పాతిక మంది అభ్యర్థుల పేర్లతో సంక్రాంతి కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదం లేనివి.. జనసేన లిస్ట్ లో లేని సీట్లను ఎంపిక చేసి అక్కడి టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. 1989 నుంచి ఆయన కుప్పాన్ని తన కంచు కోటగా మార్చుకున్నారు. ఇక్కడ ఆయనకు ఓటమి అన్నదే లేదు. కానీ ఈసారి మాత్రం సీన్ మారింది.
ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే. కొన్ని దశబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి వైరం ఉంది. అది ఇన్ని దశాబ్దాలైనా కొనసాగుతోంది. ఇద్దరూ రాజకీయాల్లోనే ఉండటంతో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువసార్లు చంద్రబాబు పై చేయి సాధించారు.