Home » Tag » KURNOOL
68 ఏళ్ల సుదీర్ఘ బంధం నేటితో విడిపోయింది. 10 ఏళ్లు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని.
ఏపీలో కొందరు టీడీపీ అభ్యర్థులు తారక్ ఫోటోలు వాడుకుంటున్నారు. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జూనియర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కర్నూలు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
పెద్దలను, పెళ్లిని ఎదురించి.. చదువే లక్ష్యం అని కష్టపడి.. ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచింది నిర్మల. పదో తరగతి తర్వాత.. నిర్మలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. చదివించలేమని… దగ్గరలో ఇంటర్ కాలేజీ కూడా లేదని కూతురిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
రాజకీయ దిగ్గజ కుటుంబాలకు కేరాఫ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా. దశాబ్దాల తరబడి ఆయా కుటుంబాల్లో రెండేసి స్థానాలకు పోటీ చేసే పద్ధతి కొనసాగుతోంది. ఒకరు ఎంపికి, మరొకరు ఎమ్మెల్యేకి, లేదంటే ఇద్దరూ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం పరిపాటి అయింది. ఇద్దరూ గెలవడం, లేదా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినా... మొత్తంగా ఏళ్ళ తరబడి చట్ట సభల్లో ఆ కుటుంబాల ప్రాతినిధ్యం కొనసాగుతోంది.
వర్షం పడితే వజ్రాలు ఏరుకునే ప్రాంతం అది. కార్మిక కర్షకులు, విద్యార్థులు నిరుద్యోగులు.. ఏజ్‌తో పనిలేదు, టైంతో సంబంధం లేదు. తొలకరి పలకరించిందంటే చాలు అంతా పొలాల్లో తిష్ట వేస్తారు. వజ్రాలు వెతకడం ప్రారంభిస్తారు.
సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్.
త్వరలోనే విశాఖ రాజధానిగా పాలన ప్రారంభిస్తాం అంటూ గతంలో చెప్పారు ఏపీ సీఎం జగన్. మొన్న ఉగాది నుంచే సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత జూలై నుంచే పాలన మొదలు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మత్రం సెప్టెంబర్‌లో విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తాం అని చెప్పారు.