Home » Tag » Lakshadweep
ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల జనాలకు వరుణుడు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాడు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో.. జనాలు రిలీఫ్ అవుతున్నారు.
మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా, లక్షద్వీప్ దీవుల్ని తెరమీదకు తెచ్చారని అంతా భావించారు. అయితే.. మోదీ లక్ష్యం పర్యాటకం ఒక్కటే కాదు. అంతకుమించి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, మాల్దీవ్స్‌కు గుణపాఠం చెప్పడంతోపాటు మోదీ వేసిన ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్ మాల్దీవ్స్ ( Ban Maldives) హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది.
మాల్దీవ్స్, లక్షద్వీప్.. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ రెండే హాట్ టాపిక్. ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్లి ఆ ఫొటోలు ఇంటర్నెట్లో షేర్ చేయడంతో లక్షద్వీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాల్దీవ్స్ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇండియన్స్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మాల్దీవ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్‌ను ఇంటర్నెట్లో ట్రెండ్ చేస్తున్నారు.
లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్, మాల్దీవుల వైపే.. ఇటీవల భారత ప్రధాని భారత దేశపు.. లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లిగా కోట్టిపారేస్తు.. మా దేశం మాల్దీవులకు మా దేశ లక్ష దీవులు లో పొంతనే లేదు అన్నట్టుగా లక్ష దీవుల పర్యటకు వ్యతిరేకంగా ఆరోపనలు, పోస్టులు పెడుతుంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు, మంత్రులు.
భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ....మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.
ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సముద్ర తీరం ప్రత్యేక్ష్యం అయ్యారు. 73 ఏళ్ల వయసులో సముద్రం అడుగునకు వెళ్లి స్నోర్కెలింగ్ చేశారు. ద్వీపాంలోని స్నార్కెలింగ్ కి వెళ్ళే అక్కడ సుందరమైన చిత్రాలను X లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ. ఇక దేశ ప్రధాని ఈ సాహసం చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Snorkelling : స్నోర్కెలింగ్ అనే పదం వినడం అందరికీ కొత్తగానే ఉంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ... లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ చేయడంతో ఇది పాపులర్ అయింది. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదేంటని వెతుకుతున్నారు జనం. సముద్ర గర్భంలోకి వెళ్ళి రావాలంటే చాలా గట్స్ ఉండాలి...ప్రధాని మోడీకి ఈ వయస్సు ఎలా సాధ్యమైంది ?