Home » Tag » Lasya nanditha
పేరుకు ఎమ్మెల్యే ఐనా.. కంటోన్మెంట్ స్థానంలో చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు సాయన్న. ఇది కొందరు వ్యక్తుల నుంచి ఉంటే ఓకే.. కానీ బీఆర్ఎస్లోని స్థానిక నాయకులు నుంచి కూడా ఆయకు తీవ్ర వ్యతిరేకత ఉండేదని టాక్.
సాధారణంగా ఎవరైనా పదవిలో ఉండగా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఇలాంటప్పుడు ఇతర పార్టీలు పోటీలో ఉండవు. సిట్టింగ్ పార్టీకే వదిలేసి, ఎన్నిక ఏకగ్రీవం చేస్తాయి. ఈ సంప్రదాయం ప్రకారం.. ఇక్కడ బీఆర్ఎస్కే సీటు వదిలేయాలి.
కారు నడిపేప్పుడు డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి ఉన్నాడా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీయబోతున్నారు. దీనికి సంబంధించి ఆకాశ్ బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించారు. ఇక అతని ఫోన్ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు.
లాస్యతో పాటు కారులో ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు లాస్య కారులో ఉన్నాడు..? ఆ కారు అతను ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు..? రాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు వాళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు..? ఏం చేశారు..?
దర్గా నుంచి వెళ్లిన తర్వాత ప్రమాద ఘటనకు మధ్యలో.. ఆ ఐదు గంటలు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయ్. లాస్య మరణం వెనక ఏం జరిగింది.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి..?
లాస్య ప్రయాణించిన మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అంత వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఇక లాస్య ఘటనలో చాలా అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్.
అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంత కుమారికి సూచించారు. గతేడాది ఇదే నెలలో లాస్య తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు.
సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతేడాది నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు. ఇక అటు లాస్య పార్థివదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.
సదాశివపేట వెళ్లారని ఒకరు.. బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె మరణంపై మరిన్ని అనుమానాలు అలుముకున్నాయ్. ఐతే యాక్సిడెంట్‌కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు. వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు.