Home » Tag » Latest News
ఈరోజు డయల్ న్యూస్ ముఖ్యాంశాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) కారు ప్రమాదంలో (Road Accident) చనిపోవడంతో కుటుంబసభ్యులు షాక్ లో ఉన్నారు. ఏడాదిగా ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. 2023 ఫిబ్రవరి 19 నాడు సాయన్న అనారోగ్యంతో చనిపోయారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) మృతి తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే లాస్య చనిపోయవడం అత్యంత విషాదంగా మారింది. సరిగ్గా గతేడాది ఇదే నెలలో.. లాస్య తండ్రి, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కూడా చనిపోయారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా (Pan Indian) మూవీల్లో దేవర ఒకటి.. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. జూనియర్ - కొరటాలది (Jr. NTR, Koratala Siva) క్రేజీ కాంబో కావడంతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బయటకు వచ్చిన జూనియర్ లుక్, గ్లింప్స్ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేశాయి.
నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఓ పేషెంట్ మరణానికి కారణమైతే డాక్టర్లకీ శిక్షలు తప్పవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత బిల్లు 2023లో ఈ ప్రొవిజన్ ఉంది. అయితే గతంలో ఉన్న ఐదేళ్ళ శిక్షా కాలానికి బదులు రెండేళ్ళకు తగ్గించారు. పేషెంట్ కు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.