Home » Tag » Lay offs
అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి సిబ్బంది చేతిలో ఊస్టింగ్ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏమిటి..? భూతల స్వర్గం లాంటి అగ్ర రాజ్యంలో వేతన జీవుల దిన దిన గండానికి కారణం ఏమిటి?
గత దశాబ్ధం నుంచి ఎవరు చూసినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నామని ఏదో కంపెనీ పేరు చెప్పేవారు. మరికొందరైతే ఫలానా కంపెనీలో క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యామని ఆనంద పరవశంలో మునిగి తేలేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వాటికి భిన్నంగా మారిపోయాయి. భారత ఐటి రంగానికి చెందిన కొన్ని దిగ్గజ సంస్థలు తమ క్యాంపస్ హైరింగ్ ను ఈ ఏడాది 40శాతం వరకూ తగ్గించామని పేర్కొన్నాయి.
ఉద్యోగానికి వెళ్లేముందు ప్రతి ఒక్కరు మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు. టెర్మినేషన్ మెయిల్ లేకపోతేనే ఆఫీసు బాట పడతున్నారు. ఆఫీసుకు వెళ్లగానే పింక్ స్లిప్ ఉందేమోనని చూసుకుంటున్నారు. లేకపోతే హమ్మయ్య ఈ రోజుకు సేఫ్ అంటూ పనిలో పడిపోతున్నారు.