Home » Tag » Left Parties
కాంగ్రెస్ గెలవాలంటే ఇదొక్కటే సరిపోదని, వామపక్షాల మద్దతు కూడా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. గతంలోనే వామపక్షాలు తమతో కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. పైగా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో కూడా వామపక్షాలు భాగస్వాములుగా ఉన్నాయి.
సీపీఐ, సీపీఎంలకు షాకిస్తూ.. నాలుగు మినహా అన్ని సీట్లకు కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ మధ్య పొత్తుపై ఇంతకాలం జరిగిన ప్రచారం ఒట్టిదేనని దీంతో తేలిపోయింది. కేసీఆర్ నిర్ణయం నిజంగా కామ్రేడ్లకు షాకిచ్చిందనే చెప్పాలి.
అభిమానంతోనో.. ఆయన పాటపై ఉన్న మమకారంతోనో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు.. జూర్జువా పార్టీలు అని ముద్రవేసుకున్న పార్టీలు గద్దర్ కు ఘన నివాళులు అర్పించి ఉండొచ్చు. కానీ ఎందుకో వామపక్షాలు మాత్రం గద్దర్ చివరి ఘడియలను ముందుండి నడిపించలేకపోయారు.
కమ్యూనిస్టుల్ని దూరం పెట్టి, ఎంఐఎంతో కలిసి సాగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు ఉండదు కానీ.. అవగాహనా ఒప్పందం మాత్రం ఉంటుంది.
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా.. హక్కుల కోసం అసువులు బాసిన పతాకగా.. కమ్యూనిజానికి గుర్తింపు ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని, అరుణ పతాకాన్ని అందించి ఉద్యమాలతో సామాన్యులకు కమ్యూనిజం సాధించిపెట్టిన విజయాలు, ప్రయోజనాలు ఎన్నో ! ఐతే ఇదంతా గతం.. ఎర్రజెండాలు ఇప్పుడు వెలిసిపోతున్నాయ్. మారిన రాజకీయ ఆటలో కామ్రేడ్లు కష్టపడలేకపోతున్నారు. దిక్కులు చూస్తున్నారు.. అడుగులు మారుస్తున్నారు. కమ్యూనిజానికి అర్థం మారుస్తున్నారు.
తెలంగాణలో కమ్యూనిస్టులు అధికార పార్టీ తాబేదార్లుగా మారిపోయారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారు.
కేసీఆర్ తో సత్సంబంధాలున్న స్టాలిన్, కుమారస్వామి సంతకాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి కొంతమంది నేతలు కేసీఆర్ కు దగ్గరైతే, మరికొంతమంది దూరమయ్యారని అర్థమవుతోంది.