Home » Tag » leopard
తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు అడవీలో ఉండల్సిన జంతువులు జనావాసాల మధ్య లోకి వస్తున్నాయి. అవి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్నాం.. కానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే దుస్తితి.. అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు నగరంలోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుత పులి వచ్చిన ఘటన చోటు చేసుకుంది.
దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు మనుషుల మధ్యకు ఎందుకొస్తున్నాయి. ? ఎక్కడో అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లోకి జంతువులు వస్తున్నాయంటే.. అనుకోవచ్చు...కానీ మహానగరాల్లోకి కూడా ఈ మధ్య వణ్యప్రాణాలు వస్తున్నాయి. మనం వాళ్లింటికి వెళ్తే.. అవి కూడా మన ఇంటికి కచ్చితంగా వస్తాయి.
మనం ఉండే చోటికి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నాయా లేక అవి ఉండే చోటుని మనుషులు అక్రమించారా? అనేది ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే తిరుమల క్షేత్రం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం.. అలాంటి చోట అడవి జంతువులు ఉండటం సహజం.. అవి ఉండే చోట మనం సంచరిస్తున్నాం.. పొలాల్లో లేదా ఇళ్ళల్లో కట్టేయాల్సిన ఆవుల్ని రోడ్లమీద ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నాం.
ఈ మధ్య కాలంలో తిరుమలలో భక్తులను చిరుత పులులు భయపెడుతున్నాయి. ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన ఘటన మరవకముందే... నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల పాప చిరుత పంజాకు బలైపోయింది. స్వామి దర్శనానికి వెళ్తూ వణ్యప్రాణులకు భక్తులు బలైపోవడం తిరుమల చరిత్రలోనే తొలిసారి.