Home » Tag » Lingayath
కర్ణాటక ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలించాయి.
కర్ణాటకలో జనతాదల్ సెక్యులర్ పార్టీ పని ఐపోయిందా? ఇంత కాలం వొక్కలిగా కమ్యూనిటీ సపోర్ట్‌తో కింగ్ మేకర్‌గా ఉన్న ఈ కన్నడ లోకల్ పార్టీ.. ఇక సైలెంట్ కాబోతోందా? ఏళ్ల నుంచి జేడీఎస్‌కు అండగా ఉన్న వొక్కలిగాలు ఇప్పుడు వాళ్లకు కటీఫ్ చెప్పేశారా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
అంచనాలే నిజం అయ్యాయ్. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. బీజేపీ బలం అనుకున్న ప్రతీ విషయం మీద కాంగ్రెస్ దెబ్బకొట్టింది. కమలానికి దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేసింది. పని అయిపోయిందని హేళన చేస్తున్న బీజేపీకి.. పిక్చర్ అభీ బాకీ హై అని కాంగ్రెస్ గర్వంగా చెప్పిన విజయం ఇది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ నుంచి కాబోయే సీఎం ఎవరన్న దానిపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు.. కర్ణాటకలో బీజేపీ ఓటమికి వంద కారణాలు వినిపిస్తున్నాయిప్పుడు ! కన్నడనాట బీజేపీకి కష్టమే అని అంతా వేశారు కానీ.. కమలం పార్టీకి ఇంత దారుణమైన ఓటమి ఎదురవుతుందని బహుశా ఎవరూ ఊహించలేకపోయారు. బలం అనుకున్న ప్రతీది.. బలహీనతగా మారింది. ఎన్నికల్లో బొక్కాబోర్లా పడేలా చేసింది. మిగతా కారణాల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ ఈ స్థాయి ఓటమికి యడియూరప్పే ప్రధాన కారణం అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు అద్భుత విజయం దక్కింది. పక్కా మెజారిటీ సాధించింది. దీంతో నెక్ట్స్ సీఎం ఎవరు అనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విక్టరీ వెనక రకరకాల కారణాలు వినిపిస్తున్నా.. కామన్‌గా అందరూ చెప్తున్న పేరు మాత్రం ఒక్కటే.. అదే రాహుల్ గాంధీ ! నిజమే కూడా ! విభేదాలు, వివాదాలు.. విమర్శలు, పార్టీలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు.. పార్టీ పరిస్థితి ఏంటా అని కాంగ్రెస్ కార్యకర్త దిక్కులు చూస్తున్న సమయంలో ఓ అడుగు పడింది.
కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప డిసైడింగ్ ఫ్యాక్టర్ అని తెలిసిన విషయమే. అలాంటి యడ్యూరప్పను సైడ్ చేసేసి ఎన్నికలకు వెళాలనుకుంది బీజేపీ హైకమాండ్. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకుంది.