Home » Tag » Lok Sabha Elections 2024
గడిచిన 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.4,658 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. సగటున రోజుకు రూ.100 కోట్లకుపైగా సొమ్ము దొరికింది. అయితే, ఇది పూర్తిగా నగదు కాదు. ఇందులో నగదు డబ్బు రూ.395.39 కోట్లు మాత్రమే.
సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ కూతురు అదితీ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లండన్‌లో హైయర్ స్టడీస్ చేస్తున్న అదితీ ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చింది. తల్లి డింపుల్ యాదవ్‌కి మద్దతుగా మైన్‌పురీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రచారం నిర్వహిస్తోంది.
అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం.
తొలి విడతలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 102 నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 20, బుధవారం నుంచి 27 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది.