Home » Tag » Loksabha Elections
పశ్చిమ బెంగాల్లో 71.84 శాతం, మణిపూర్లో 76.46 శాతం, చత్తీస్ గఢ్లో 72.13 శాతం, అసోంలో 70.67 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో ఆసక్తి రేపుతున్న రాష్ట్రం యూపీ. ఎందుకంటే ఇక్కడ అత్యల్పంగా 52.91 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
ఫైనల్గా ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామనుకునే వేళ.. కారు పార్టీని కొత్త టెన్షన్ వెంటాడుతోంది. లోక్సభ అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారేమో అనే భయం కనిపిస్తోంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు బీఫాంతోపాటు రూ.95 లక్షల చెక్కు కూడా అందజేయనున్నారు. ఎన్నికల్లో ఖర్చుల కోసం 17 మంది అభ్యర్థులకు ఈ చెక్కులు అందజేస్తారు. గురువారం, ఏప్రిల్ 18 నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేషన్లు ప్రారంభం కానుండటంతో అన్నిస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. నామినేషన్లు పూర్తైతే ప్రచారం మరింత హోరెత్తుతుంది.
ఈసారి ఎన్నికలకు మద్యం అమ్మకాలపై పరిమితులు పెట్టింది ఎలక్షన్ కమిషన్. దాంతో మద్యం దొరక్క.. మందు బాబులు లబోదిబోమంటున్నారు. ఏపీలో మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూతపడతాయో తెలియని పరిస్థితి ఉంది.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని విద్యాశాఖ తెలిపింది.
ఖమ్మం పెండింగ్లో పెట్టడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ – బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి దెబ్బపడింది. అప్పుడు జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.
సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. సిద్ధం సభలు నాలుగు చోట్ల జరిగినందున ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ సభలు జరుగుతాయి.
మొత్తం 175 స్తానాలకుగాను.. టీడీపీ 144 ఎమ్మెల్యే స్థానాల్లో, 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. దీనిలో ఇప్పటివరకు అసెంబ్లీ సీట్లకు సంబంధించి 128 మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. మరో 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించాల్సి ఉంది.
హైదరాబాద్లోని నివాసంలో కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు. కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరు.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.