Home » Tag » low pressure
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు తెలంగాణపైనా కూడా తీవ్ర ప్రభావం చూపించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం, గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఏపీలో 8 జిల్లాల్లోని 60 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. చేతికి అందిన పంటలు వరదపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరానికి చేరింది. బాపట్ల జిల్లా వద్ద మీచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు,ఈదురు గాలులు, సుడిగాలులకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం కాగా ఇప్పుడిప్పుడే తుఫాను దిశ మార్చుకుంటూ తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు భారీ వర్ష సూచన.. నేడు ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ (Meteorological Department Alert) చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.