Home » Tag » madhavi latha
థూ...మీ బతుకులు చెడా! ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని? ఏ పెంట రాసి కొట్టాలిరా మిమ్మల్ని? మనిషి పుట్టుక ఎలా పుట్టార్రా అసలు మీరంతా... ఆగండాగండి ఇవి నేను అంటున్న మాటలు..
హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీ లత (Madhavi Latha) అంతన్నారు. ఇంతన్నారు. చివరికి అంతే లేకుండా పోయారు. ఇరగదీసేస్తున్నాం... చరిత్ర సృష్టించబోతున్నాం... వాళ్ళ కోటను బద్దలు కొట్టబోతున్నామని బిల్డప్‌ల మీద బిల్డప్‌లు ఇచ్చేశారామె.
మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు.
నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఆశించారు రాజాసింగ్. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఫైనల్ చేసింది.
శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో.. రాజాసింగ్ హర్ట్ అయ్యారు. అలకపాన్పు ఎక్కారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే.. ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ.. పార్టీతో అంటీ ముట్టనట్లు కనిపిస్తున్నారు రాజాసింగ్.
తన నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన మీటింగ్‌కు డుమ్మా కొట్టిన రాజాసింగ్.. కేంద్రంలో నంబర్ 2 అయిన అమిత్ షా మీటింగ్‌కు కూడా రాలేదు. దీంతో రాజాసింగ్ తీరుపై ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.