Home » Tag » Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లోని రేవాలో 13 ఏళ్ల బాలుడు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి.. ఒక రోజు రాత్రి పూట నిద్రిస్తున్న తన సొంత 9ఏళ్ల చెల్లెలిని రేప్ చేశాడు ఓ కామందుడు.. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని 9 ఏళ్ల చెల్లి బెదిరించడంతో భయపడిన ఆ బాలుడు.. తన చెల్లి గొంతునులిమి చంపేశాడు.
భారీ స్థాయిలో బాణసంచా నిల్వ ఉండటంతో తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ప్రభావం ఎంత ఉందంటే.. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు, అద్దాలు వంటివి కూడా పగిలిపోయాయి. పేలుడు తీవ్రతకు అక్కడ ప్రకంపనలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
భారత దేశంలో ఆడపిల్లలపై అప్పటి నుంచి ఇప్పటి దాకా వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల విషయంలో ఇంకా అసమానతలు కనిపిస్తున్నాయి. ఆడ, మగ బేధం లేదు... ఇద్దరూ సమానమే అని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి యేటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెండ్ లిస్టులో ఉన్నాడు. అతడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. అతడిపై రూ.14 లక్షల రివార్డు ఉంది.
సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆయనతోపాటు జగదీష దేవ్డా, రాజేంద్ర శుక్లాను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ కి తెలంగాణ ఒక్కటే దక్కింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సెమీ ఫైనల్ గా భావించారు. ఈ సెమీ ఫైనల్స్ లో బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో.. అదే స్పీడ్ లో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ఒక నెల ముందే ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టింది. పైగా మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో గెలవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. బీజేపీ అనుకుంటే.. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
Assembly Elections Results
నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి పరమానంద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాడో కూడా చెప్పాడు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, అలాగే రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 భృతి చెల్లిస్తామని పేర్కొంది.
ఎట్టకేలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సీఈసీ సిద్దమైనట్లు తెలుస్తోంది.