Home » Tag » Madya Pradesh
విద్వేషపు కోటలో ప్రేమ దుకాణం తెరుస్తున్నామంటూ సామాన్యుడిలో ఒకడిగా మారిపోయిన రాహుల్ గాంధీ.. మరోసారి భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ తో మరోసారి జోడోయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఏ పార్టీయైనా ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించాలి. అందరి అభిప్రాయాలకు పెద్ద పీట వేయాలి. లేకపోతే పార్టీతో పాటు వ్యక్తులు కూడా నియంతలుగా మారతారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందరూ హైకమాండ్ జపం చేస్తారు గానీ.. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్యం ఏస్థాయిలో ఉంటుందంటే నిత్యం గాంధీ కుటుంబం పేరు జపించేవాళ్లు కూడా తమకు అనుకూలంగా పరిణామాలు లేకపోతే తిరుగుబాటు చేసే స్థాయి వరకు వెళ్తారు. దటీజ్ కాంగ్రెస్.
కర్ణాటక విజయం.. కాంగ్రెస్‌కు ఎడారిలో ఒయాసిస్ కాదు.. ప్రాణం పోసిన అమృతం. కాంగ్రెస్ ఇంతే.. కాంగ్రెస్‌లో ఇంతే.. హస్తం పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో.. హిమాచల్‌ప్రదేశ్ విజయం ఊపిరిలూదితే.. కర్ణాటక విజయం వెయ్యి వోల్టుల శక్తినిచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్టీకి మళ్లీ ప్రాణం పోసింది.. పరుగుకు వేగం ఇచ్చిందీ విజయం.