Home » Tag » Mafia
రాజకీయం కోసం నేతలు ఎంతకైనా దిగజారతారు.. వారికి ఓట్లే ముఖ్యం.. అవసరమైతే మాఫియా కాళ్లు పట్టుకుంటారు. అంతకుమించి కూడా చేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇప్పుడు దాన్ని మరోసారి నిరూపించారు. ఓ తెలుగుబిడ్డను దారుణంగా చంపిన గ్యాంగ్‌స్టర్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్యాంగ్‌స్టర్ అంటే నితీశ్‌కు ఎందుకంత ప్రేమ.? ఆ ఒక్కడి చుట్టూ బీహార్ రాజకీయం ఎందుకు తిరుగుతోంది.?
ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్‌లో ఇప్పుడు యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ ఒకరు. ఇప్పుడే కాదు. ముందు నుంచి ఆయన చాలా పవర్ఫుల్ లీడర్. రౌడీ కావచ్చు గూండా కావచ్చు గ్యాంగ్‌స్టర్ కావచ్చు.. వన్స్ యోగీ స్టెప్ ఇన్.. సీన్ విల్ బి రివర్స్. యోగీ తీసుకునే డిసిషన్స్ అలా ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాదు.. ఏకంగా బంతాట ఆడేయటానికైనా రెడీగా ఉంటారు యోగి.
అతీక్ అహ్మద్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడా చూసినా ఈ పేరే వినిపిస్తోంది. అతన్ని చంపిన విజువలే కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్ల పాటు యూపీ నేర సామ్రాజ్యానికి కింగ్‌పిన్‌లా ఉన్న అతీక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు అంతా చూస్తుండగానే పోలీసుల సమక్షంలో దారుణంగా షూట్ చేసి చంపేశారు.
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలు కూడా ఆడవారు బయటకు రావాలంటే భయపడేవారు. ఎప్పుడు ఎవడు ఎత్తుకెళతాడో తెలిసేది కాదు. పోలీసోళ్ల పెళ్లాలకే దిక్కులేదు.. విక్రమార్కుడు సినిమాలో సీన్‌కు కాస్త అటూ ఇటుగానే సిట్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.