Home » Tag » MAHARASTRA
అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.
మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రకంపణలు రేగాయి. చాలా రోజుల నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుడిగా ఉన్న అజిత్ పవార్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వీళ్లందరితో కలిసి ఎన్డీయేలో చేరారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర లో జండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో రోజురోజుకూ డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. దీనికి ప్రదానమైన వేదిక పబ్బులు అనే చెప్పాలి. కొన్ని పబ్బులో ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉంటుంది. తాజాగా తెలుగు కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణ ప్రసాద్ చౌదరిని మాదకద్రవ్యాల విక్రయం కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. కేపీ చౌదరీ కొకైన్ అమ్ముతుండగానే పట్టుకున్నట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి సుమారు 82.75 గ్రాముల కొకైన్ తో పాటూ ఒక కారు, 2 లక్షలకు పైగా నగదు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ముంచుకొస్తున్న బిపోర్ జోయ్.
బిపర్ జోయ్ తుఫాన్ దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు కొన్ని వందల మీటర్లమేర సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని పరిస్థితిని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్ధం కావు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో శివసేన – షిండే వర్గాల మధ్య జరిగిన రాజకీయ పరిణామం అని చెప్పాలి. ఈ రాజకీయ చదరంగంలో ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ సీటు కింద ఇప్పుడు ప్రకంపనలు ప్రభలే ఆస్కారం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.
ఎక్కడో జరిగే చిన్న మూమెంట్.. ఇంకెక్కడో జరిగే మరో మూమెంట్‌కు కారణం అవుతుంది. ఇది సైన్స్.. ఇదే సైన్స్ కూడా ! రాజకీయాల్లోనూ ఇదే జరుగుతోంది. తీగ ఎక్కడో లాగితే.. డొంక ఇంకెక్కడో కదులుతూ ఉంటుంది. ఒక నిర్ణయం వెనక.. ప్రత్యర్థి తీసుకున్న మరో నిర్ణయం కారణం అయి ఉంటుంది.
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారం సాధించేందుకు పావులు కదుపుతూనే.. మరోవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. ఏపీలో ఇప్పటికే జోరు పెంచగా.. మహారాష్ట్ర మీద ప్రత్యేక దృష్టిసారించారు. రెండు బహిరంగ సభలు నిర్వహించి.. తమ తర్వాత టార్గెట్ ఇదే అని మహారాష్ట్ర రాజకీయానికి సవాల్ విసురుతున్నారు కేసీఆర్.
15 ఏళ్ల గర్భిణీ బాలిక తన బిడ్డను జన్మనివ్వడం కోసం యూట్యూబ్ వీడియోలు చూసి, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం తన సొంత బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడ్చినా కూడా ఇరుగుపొరుగు వారికి తెలియకుండా ఉండేందుకు బెల్టుతో గొంతు కోసి చంపేసింది.