Home » Tag » Majlis Party
హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీ లత (Madhavi Latha) అంతన్నారు. ఇంతన్నారు. చివరికి అంతే లేకుండా పోయారు. ఇరగదీసేస్తున్నాం... చరిత్ర సృష్టించబోతున్నాం... వాళ్ళ కోటను బద్దలు కొట్టబోతున్నామని బిల్డప్‌ల మీద బిల్డప్‌లు ఇచ్చేశారామె.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ఆసక్తి రేపుతున్నాయ్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..
ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా ముస్లింలకు తామే వారసులమని చెప్పుకుంటున్న ఓవైసీ బ్రదర్స్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ సూపర్ ప్లాన్ వేసింది. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి MBT తో చెక్ పెట్టాలని నిర్ణయించింది. పాత బస్తీలో ఒవైసీలకు చెందిన మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీకి.. మజ్లిస్ బచావో తెహ్రీక్ కి పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. పాత బస్తీలో ఎంబీటీ ఒక్క సీటు గెలుచుకోకపోయినా.. ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత పుంజుకుంటోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ పార్టీ తన రూట్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళుగా BRS తో దోస్తీ కట్టిన MIM.. ఇప్పుడు ఆ పార్టీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టు అర్థమవుతోంది. ప్రొటెం స్పీకర్ గా MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం చూస్తే.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందని తెలుస్తోంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికలు MIMకు ఊహించని ఝలక్ ఇచ్చాయి. ఆ పార్టీ కంచు కోటలకు బీటలు వారుతున్న సంకేతాలు వెలువడ్డాయి. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక చోట ఓడిపోయి ఏడు సీట్లను మాత్రమే గెల్చుకుంది మజ్లిస్. పేరుకు ఏదైనా.. కొన్ని చోట్ల చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఉంది పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్తో ఎంఐఎం జత కట్టడం రెండు పార్టీలకీ కలిసి వస్తుందని భావించారు. కానీ ఫలితాల సరళి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందట.
మజ్లిస్ పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ వచ్చే పోల్స్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ చేసిన నూరుద్దీన్ ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి చెందిన సలార్–ఎ–మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా, కార్యదర్శిగా పని చేస్తున్నాడు. నూరుద్దీన్‌ను ఎన్నికల బరిలోకి దింపాలని మజ్లిస్ పార్టీ క్యాడర్ ఒవైసీ బ్రదర్స్‌పై ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది.